మార్పు - నేర్పు

మార్పు - నేర్పు

ఎక్కడో అమెరికా లో ప్రజలు మార్పు కావాలి అంటే, భారతీయులంతా కూడా అదే కొరుకుంటారు అనుకునే అంత అమాయకులా మన నాయకులు ? నినాదాలు కాదు న్యాయమైన, నాణ్యమైన నడత కావాలి.ఒక్క రాజకీయ పార్టీ తో మార్పు వచ్చెస్తే ఈ స్వర్ణ - స్వతంత్ర భారతి ఎప్పుడో అభివ్రుద్ది చెందిన దేశాల సరసన ఉండేది.

మాకు మార్పు వద్దు !! కాని మెరుగు కావాలి, మెరుగైన సమాజం కావాలి, మెరుగైన నాయకులు కావాలి, మెరుగైన రాజ్యాంగం కావాలి .కేవలం "ప్రస్తుతానికి" మెరుగు చాలు "మార్పు" వద్దు. మెరుగే మార్పునిస్తుంది; మా ఆలొచనల లో మార్పు నిస్తుంది; మా నడత లో మార్పునిస్తుంది; మా జీవనం లో మార్పు నిస్తుంది; మా సమాజం లొనే మార్పుతెస్తుంది.

నాయకులంటె, నాన్న లాంటి వాళ్ళు. ఓక ఇంటి స్థితి - గతు లను తండ్రి ఎప్పటికప్పుడు ఎలా మెరుగుపరుస్తాడో; మన నాయకుడు కుడా తన సమాజమనే కుటుంబాన్ని, దాని స్థితి - గతు లను ఎప్పటికప్పుడు మెరుగు పరిస్తే చాలు. మార్పు ఒక్క ఎన్నికలతో రాదు. మనల్ని మనం మెరుగు పరుచుకుంటే అదే మార్పు !

"చెట్టూ మాదే - పుట్ట మాదే" .. "విత్తు వెసింది మా తాత, పుట్ట కట్టింది మా మామ" అంటూ కుటుంబ కీర్తి కి నిదర్శనాలు గా రాజకీయపార్టీలని మర్చెవాళ్ళు ఒక్కలు అయ్తే , ఫులి ని చుసి నక్క వాతలు పెట్టుకున్న చందాన అవగాహనా రాహిత్యం తో రాజకీయ రంగు ని పులుముకుంటు కుటుంబ సబ్యులందరికి అదే రంగులు అద్దుతూ "హొలీ" పండగ చెసుకునీ నయకులు కొందరు.

మార్ఫు దేని కోసం ? ప్రజల బ్రతుకుల లోనా, వారి జీవన శైలి లోన, వారి జీత బత్యా ల లోనా ,దెనిలో ..?
ఏ ఒక్క దానిలోను ఇన్నాళ్ళ లో, ఇన్నేళ్ళలో ఏ మాత్రం పెనుమార్పు చూడలేదు. ఇక చూడం కూడా. అందుకే మార్పు ఎందుకు ? మెరుగు చాలు !

కేవలం మన నాయకులు చెప్పే ఆ మార్పు ఎంటో తెల్సా ? అది కేవలం వాళ్ళ కి ఒక జల్సా !!
వాళ్ళకి కావల్సిన మార్పు - వాల్ల జీవన శైలి లో ఒక మార్పు, వారి స్థాయి లో ఒక మెట్టు అదిగమించటం, వాళ్ళ పరపథి పెంచుకొవటం.ఇవి కాక వాళ్ళు కోరుకునే మార్పు కి ప్రత్యేక ఆలోచన ఎమీ ఉండదు. ఉండి ఉంటే వాళ్ళు సమాజం పట్ల కలిగి ఉన్న భావలన్ని ఎందుకు వ్యక్తీకరించరు ?ఎందుకంటె వాళ్ళకి సమాజం లో అసమానతలంటే తెలీదు. "గంజి తెలుసు - బెంజి తెలుసు " అన్న మాటల గారడి లో అంతరార్దం సామన్యుడు గుర్తిస్తే వాల్లు చెప్పుకునే మార్పు ఎమిటో కుడా విదితం అవుతుంది.
ఎన్నికల కొసం ఎన్నికళ్ళతొనో ఎదురుచూస్తున్న ఓ సొదర సొదరీమను లారా (ఓటరు మహాశయులార !! ఎంట గౌరవం ఉంది ఆ పిలుపులో ??)
నేతలూ మీ మాటల లో నేర్పు అవసరం లేదు! ఆ నేర్పు మీ చేతల లో మార్పు తేవటానికి ఉపయొగించండి . అదే ఈ సమాజాన్ని మారుస్తుంది .  
ఇక నయిన మీరే ఆలోచించడి మనకి మార్పు కావాలా ?


1 comments to "మార్పు - నేర్పు"

Post a Comment

Who ever writes Inappropriate/Vulgar comments to context, generally want to be anonymous …So I hope U r not the one like that?
For lazy logs u can at least use Name/URL option which don’t even require any sign-in, good thing is that it can accept your lovely nick name also and URL is not mandatory too.
Thanks for your patience
~Krishna(I love "Transparency")
వీలయితే నాల్గు పోస్టులు ...కుదురితే ఒక కామెంటూ ...

Translate

Enter your email address:

Buffs ...

Visitors


hits counter
View My StatsCheck Google Page Rank

Add to Google Reader or Homepage

Bookmark and Share

Tags


Powered by WidgetsForFree

Archives